ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉచిత విద్య: కవిత 'పాంచజన్యం' హామీలు
- ఐదు కీలక హామీలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు
- ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రకటించిన కవిత
- రైతును రాజుగా చేస్తామన్న కవిత
- ఉపాధి కోసం యువతకు రుణాలు
'తెలంగాణ రాష్ట్ర సేన' (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాంచజన్యం పేరుతో ఐదు హామీలను ప్రకటించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని మునీరాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పార్టీ పేరును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కీలకమైన ఐదు హామీలను అమలు చేస్తామని తెలిపారు.
విద్య: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ ఉచిత విద్యను అందిస్తామని ప్రకటించారు. విద్యకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, కానీ నాడు కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బంద్ చేశారని ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తున్నారని మండిపడ్డారు.
వైద్యం: ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రిలో కూడా ఏ వ్యాధికి అయినా ఉచిత వైద్యం అందిస్తామని తెలిపారు.
వ్యవసాయం: రైతును రాజుగా చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని కవిత తెలిపారు. ప్రస్తుతం ఏ బ్యాంకుకు లేదా ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా సూటు బూటు వేసుకుని వస్తే కుర్చీ మీద కూర్చోబెట్టి గౌరవిస్తారని, కానీ రైతుకు మాత్రం సరైన గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక రైతుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
ఉపాధి: ప్రస్తుతం ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నాయని, కానీ ఉపాధిపై దృష్టి సారించడం లేదని కవిత ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే ఉపాధి కోసం యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
సామాజిక న్యాయం: తమ ప్రభుత్వంలో సామాజిక న్యాయం పాటిస్తామని కవిత చెప్పారు. తాను తల్లి స్థానంలో ఉన్నానని కాబట్టి తాను జేబు చూడనని, తెలంగాణ ప్రజల బాగోగులు చూస్తానని తెలిపారు. సామాజిక తెలంగాణను సాధించాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరగాల్సిందే అన్నారు. అగ్రకులాల్లోని పేదలను కూడా ఆదుకుంటామని అన్నారు. బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ముంగిటకు వస్తోందని, సామాజిక న్యాయం తెస్తుందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ రాజకీయాలతో పాటు ప్రజాపోరాటాలు చేస్తుందని కవిత తెలిపారు.